ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT Hyderabad ), వివిధ విభాగంలో ఖాళీగా ఉన్నఅసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నవంబరు 17వ తీదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IIT Hyderabad:
ఖాళీల వివరాలు ;
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II
2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I
3. అసోసియేట్ ప్రొఫెసర్
4. ప్రొఫెసర్
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
విభాగాలు:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, క్లైమేట్ చేంజ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, డిజైన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్, లిబరల్ ఆర్ట్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ ,మ్యాథమెటిక్స్ , మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఫిజిక్స్.
గరిష్ఠ వయోపరిమితి:
38 ఏళ్ల నుంచి 60 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ:
ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
17-11-2025.
దరఖాస్తు చివరి తేదీ:
09-12-2025,
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా.