TSLPRB: తెలంగాణ పోలీస్ బోర్డు నుండి 60 ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా 2025 సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (TG FSL) లో మొత్తం 60 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు & ఖాళీలు:

సైంటిఫిక్ ఆఫీసర్‌ పోస్టులు

ల్యాబ్ టెక్నీషియన్

ల్యాబొరేటరీ అటెండెంట్

మొత్తం 60

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/బైపీసీ), ఎంఏ/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంటెక్‌/ఎంసీఏ/బీఎస్సీ ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2025 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; ఎక్స్‌సర్విస్‌మెన్‌లకు మూడేళ్లు; దివ్యాంగులకు 10ఏళ్లు; తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

సైంటిఫిక్‌ ఆఫీసర్‌కు రూ.45,960- రూ,1,24,150;

సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ.42,300- రూ.1,15,270;

ల్యాబ్ టెక్నీషియన్‌కు రూ24,280- రూ.72,850;

ల్యాబ్ అటెండెంట్‌కు రూ.20,280- రూ.62,110.

విద్యార్హతల మార్కులు, రాత పరీక్ష ఆధారంగా

ఆన్‌లైన్‌ ద్వారా.

సైంటిఫిక్ ఆఫీసర్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.2,000 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000); ల్యాబ్ టెక్నీషియన్‌కు రూ.1200(ఎస్సీ/ఎస్టీలకు రూ.600); ల్యాబ్ అటెండెంట్‌కు రూ.1000(ఎస్సీ/ఎస్టీలకు రూ.500).

ప్రారంభ తేదీలు 27.11.2025.

దరఖాస్తు చివరి తేదీ: 15.12.2025.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్