మాజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ లో 200 ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్

ముంబయిలోని మాజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌.. 2025-26 సంవత్సరానికి ఏడాది అప్రెంటిస్‌ ట్రైనింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.200 డిప్లొమా ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ 05-01-2026 నాటికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

కంపెనీ పేరు ముంబయిలోని మాజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌
పోస్టు పేరు ఇంజినీర్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌
జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌
మొత్తం పోస్టులు 200
జీతం నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900.
అర్హతలు ఖాళీని అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ, జనరల్‌ డిగ్రీ. 01 ఏప్రిల్‌ 2021 లేదా ఆ తరువాత ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసిన లేదా కొనసాగిస్తున్న అభ్యర్థులు అర్హులు కారు
వయోపరిమితి 01-03-2026 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రారంభ తేదీ December 16 , 2025
చివరి తేదీ January 05 , 2026

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఎండీఎల్‌ అప్రెంటిస్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఎన్‌ఏటీ 2.0 పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.12.2025.

దరఖాస్తుకు చివరి తేదీ: 05-01-2026.

ఇంటర్వ్యూ షెడ్యూల్‌: 16-01-2026.

ఇంటర్వ్యూలు ప్రాంరంభం: 27-01-2026.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్