పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (CBSL) ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 10 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
జూనియర్ ఆఫీసర్ - 04
అసిస్టెంట్ మేనేజర్ - 04
డిప్యూటీ మేనేజర్ - 02
విద్యార్హత:
ఏదైనా విభాగంలో కనీసం 50శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఎన్ఐఎస్ఎం/ఎన్సీఎఫ్ఎం సర్టిఫికేషన్ ఉన్న వారికి ప్రాధాన్యత.
జీతం
నెలకు జూనియర్ ఆఫీసర్‌కు రూ. 38,160 - రూ. 50,360, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ. 25,440 - రూ. 36,740, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 34,800 - రూ. 40,800.
గరిష్ఠ వయో పరిమితి
అభ్యర్థులకు వయస్సు 20 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం
షార్ట్‌లిస్టింగ్ & ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం
ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ
14 నవంబర్, 2025.