రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2025 సీబీటీ-1 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి https://indianrailways.gov.in/ అధికారిక వెబ్సైట్, ఆర్ఆర్బీ ప్రాంతీయ వెబ్సైట్ల ద్వారా ఫలితాలు పొందవచ్చు. 27.55 లక్షల మంది అభ్యర్థులు సీబీటీ-1 పరీక్ష రాయగా.. వారిలో 51,979 మంది సీబీటీ-2కు అర్హత సాధించారు. మొత్తం 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.