అగ్రికల్చరల్ కాలేజీ బాపట్ల (ANGRAU) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 27వ తేదీ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
పోస్టు పేరు - ఖాళీలు *
టీచింగ్ అసోసియేట్ (హర్టీకల్చర్): 02
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి:
పురుష అభ్యర్థులకు 40 ఏళ్లు, మహిళా అభ్యర్థులకు 45 ఏళ్లు మించకూడదు.
జీతం:
నెలకు రూ.61,000 - రూ.67,000.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ:
2025 నవంబర్ 27.
వేదిక:
అగ్రికల్చరల్ కాలేజీ, బాపట్ల.