ముంబయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 122 డిప్యూటీ మేనేజర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 27 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
ఖాళీల వివరాలు
డిప్యూటీ మేనేజర్ (హెచ్ఆర్) - 31 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ) - 48 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (సీ&ఎంఎం) - 34 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (లీగల్) - 01 ఖాళీలు
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - 08 ఖాళీలు
జీతం
నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.56,100 మరియు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కు రూ.35,400.
వయోపరిమితి
డిప్యూటీ మేనేజర్‌కు 18 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07 నవంబర్, 2025.
దరఖాస్తు చివరి తేదీ: 27 నవంబర్, 2025
గమనిక: అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు తదితర పూర్తి నోటిఫికేషన్ నవంబర్ 07 నుంచి అధికారిక వైబ్సైట్లో చూడగలరు.