
మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు పూర్తిగా ఆన్లైన్ మోడ్ ద్వారానే జరుగుతాయని సంస్థ స్పష్టం చేసింది.చాలా వరకు డిగ్రీ అర్హతతో వున్నవే !!!
| కంపెనీ పేరు | మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) |
| పోస్ట్ పేరు | జూనియర్ ఓవర్మాన్ T&S Gr-C, మైనింగ్ సిర్దార్ T&S Gr-C, సర్వేయర్ T&S Gr-B, ట్రాన్స్లేటర్ (Tr.) OL క్లరికల్ Gr. III, టెక్నీషియన్ (పాథాలజీ) Tr. T&S Gr-C |
| పోస్టుల సంఖ్య | 667 |
| జీతం | రూ. 41,966.51 PM నుండి రూ. 51,103.12 PM (ప్రాథమిక వేతనం – NCWA-XI) |
| అర్హత | మైనింగ్ ఇంజనీరింగ్లో డిప్లొమా/డిగ్రీ, చెల్లుబాటు అయ్యే చట్టబద్ధమైన సర్టిఫికెట్లు, హిందీ & ఇంగ్లీషుతో బిఎ, పాథాలజీలో డిప్లొమా - పోస్ట్ ప్రకారం |
| వయోపరిమితి | 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు (06/04/2026 నాటికి) |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 16/03/2026 (ఉదయం 10:00 గంటలకు) |
| దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 06/04/2026 (రాత్రి 11:50) |
| అధికారిక వెబ్సైట్ | https://mahanadicoal.in/ |
ఎంపిక విధానం:
అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో సెక్షన్ 'A' (జనరల్ అవేర్నెస్) నుంచి 20 మార్కులు, సెక్షన్ 'B' (టెక్నికల్ నాలెడ్జ్) నుంచి 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కులు ఉండవు
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,180 (ఫీజు రూ.1,000 + GST రూ.180) చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
Notification Link :