
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగలకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముంబయి ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది .. దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్ట్రీములో క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-III, ఎంఎంజీఎస్-II, ఎస్ఎంజీఎస్-IV)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 20 నుంచి జనవరి 05వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
| కంపెనీ పేరు | బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) |
| పోస్ట్ పేరు | క్రెడిట్ ఆఫీసర్ |
| పోస్టుల సంఖ్య | 514 |
| జీతం | నెలకు రూ. 64,820 - రూ. 120,940 |
| అర్హత | కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ |
| వయోపరిమితి | 25 నుండి 40 సంవత్సరాలు |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 20/12/2025 |
| దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 05/01/2026 |
| అధికారిక వెబ్సైట్ | www.bankofindia.bank.in/ |
ఖాళీల వివరాలు:
1. క్రెడిట్ ఆఫీసర్(ఎస్ఎంజీఎస్-IV): 36 పోస్టులు
2. క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-III): 60 పోస్టులు
3. క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II): 418
పోస్టులు మొత్తం పోస్టుల సంఖ్య: 514.
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.( 60%)
రిజర్వ్డ్ కేటగిరీ (SC/ST/OBC/PWD) అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు (కనీసం 55% అవసరం) లభిస్తుంది.
పే స్కేల్:
MMGS-II స్కేల్: నెలకు రూ. 64,820 – 2,340 (1) – 67,160 – 2,680 (10) – 93,960
MMGS-III స్కేల్: నెలకు రూ. 85,920 – 2,680 (5) – 99,320 – 2,980 (2) – 105,280
SMGS-IV స్కేల్: నెలకు రూ. 102,300 – 2,980 (4) – 114,220 – 3,360 (2) – 120,940
వయోపరిమితి :
- క్రెడిట్ ఆఫీసర్ MMGS-II: కనీసం 25 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు
- క్రెడిట్ ఆఫీసర్ MMGS-III: కనీసం 28 సంవత్సరాలు, గరిష్టంగా 38 సంవత్సరాలు
- క్రెడిట్ ఆఫీసర్ SMGS-IV: కనీసం 30 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు
ఎంపిక విధానం:
ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).
పరీక్ష విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో
ఇంగ్లిస్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 25 మార్కులు;
రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు;
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు;
ప్రొఫెషనల్ నాలెడ్జ్ (క్రెడిట్/బ్యాంకింగ్ సంబంధిత) 75 ప్రశ్నలు 75 మార్కులకు
మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :-
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.12.2025. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.01.2025.